జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్
- June 26, 2020
న్యూ ఢిల్లీ:కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో జులై 15 వరకు ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలపై బ్యాన్ విధిస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి కూడా విదేశాలకు విమాన సర్వీసులు నడపబోమని వెల్లడించింది. వీటిలో డీజీసీఏ పర్మిషన్ పొందిన.. కార్గో రవాణా ఫ్లైట్స్ కు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు వివరించింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని వెల్లడించింది.
కరోనావైరస్ సంక్షోభం మధ్య దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో మార్చి 25 న భారతదేశం అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సడలింపుల్లో భాగంగా మే 25 నుండి దేశీయ విమానాలను అనుమతించారు. మే 6 నుండి వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో చిక్కుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వస్థలలాకు తరలించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు