షార్జా:నిర్లక్ష్యంగా వదిలేసిన 400 కార్లను సీజ్ చేసిన పోలీసులు
- June 30, 2020
షార్జా:నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలను గుర్తించి సీజ్ చేశారు షర్జా పోలీసులు. షర్జా మున్సిపాలిటి అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తొలుత 419 వాహానాలను సీజ్ చేశారు. నగరంలో వాహనాల ఓనర్లు బాధ్యతగా వ్యవహరించాలని పోలీస్ ఉన్నతాధికారులు కోరారు. అలా వదిలివేసిన వాహనాలు చోరీలకు ఊతం ఇచ్చేలా మారుతున్నాయని, కొన్ని సార్లు దొంగలు కార్లనే మాయం చేసేస్తున్నారని, మరికొన్ని సందర్భాల్లో కార్లలోని విడి భాగాలను దొంగిలిస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలు షార్జా నగర ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. అందువల్ల నగరంలో నిర్లక్ష్యంగా వదిలివేయబడిన కార్ల ఓనర్లు బాధ్యతయుతంగా వ్యవహరించి వాటిని తీసివేయాలన్నారు. 48 గంటల్లో వాహనాలను తొలగించకపోతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు