కరోనా ఇప్పట్లో వదలదు:WHO
- June 30, 2020
జెనీవా:కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చి ఆరు నెలలు అయింది. ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 5 లక్షమంది మహమ్మారి బారిన పడి మరణించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కొన్ని దేశాలు పురోగతిని సాధించినా.. భయంకరమైన వాస్తవం ఏమిటంటే.. ఈ వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగియదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసన్ స్పష్టం చేశారు. వైరస్‌ను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం లేదని డబ్ల్యుహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో చేయగలిగింది ఒక్కటే.. వైరస్ సోకిన వారిని గుర్తించడం.. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని రేయాన్ సూచించారు. ఈ విధానాన్ని అనుసరిస్తూ వ్యాప్తిని కొంత నిరోధించిన దేశాలు జపాన్, దక్షిణ కొరియాలను ఉదాహరణగా చూపించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!