మినా అబ్దుల్లా వేర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం: 300కి పైగా కార్లు ధ్వంసం

మినా అబ్దుల్లా వేర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం: 300కి పైగా కార్లు ధ్వంసం

కువైట్ సిటీ:మినా అబ్దుల్లాలోని ఓ వేర్‌ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 3000కి పైగా కార్లు ధ్వంసమయ్యాయి. మొత్తం 125 వేల చదరపు కిలోమీటర్లలో ఈ వేర్‌ హౌస్‌ విస్తరించి వుంది. 9 ఫైర్‌ స్టేషన్స్‌కి చెందిన యూనిట్స్‌ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. పెద్ద మొత్తంలో వుడ్‌ అలాగే 3000కి పైగా కార్లు ధ్వంసమయినట్లు అధికారులు తెలిపారు. ఓపెన్‌ ఏరియాలో చోటు చేసుకున్న చిన్నపాటి అగ్ని ప్రమాదం, గాలుల తీవ్రత కారణంగా పెరిగి.. పెద్దయెత్తున ఆస్తి నష్టానికి కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు.

Back to Top