2036 దాకా పాలనలో కొనసాగనున్న పుతిన్.. అభినందించిన మోడీ

- July 02, 2020 , by Maagulf
2036 దాకా పాలనలో కొనసాగనున్న పుతిన్.. అభినందించిన మోడీ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌తో గురువారం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో పాటు, రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు  అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు. భారత్‌-రష్యా ప్రజల మధ్య స్నేహానికి సంకేతంగా ఈ ఏడాది జూన్ 24 న మాస్కోలో జరిగిన సైనిక కవాతులో భారతీయ బృందం పాల్గొందని ప్రధాని గుర్తు చేశారు.

కోవిడ్‌-19 ప్రతికూల ప్రభావాన్నఅధిగమించేందుకు ఇరు దేశాలు చేపట్టిన చర్యలను ఇరువురు నేతలు సమీక్షించారు. కోవిడ్‌-19 అనంతరం ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్‌లను సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు అవసరమని ఇరువురు నేతలు అంగీకరించారు.

ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు ద్వైపాక్షిక సంప్రదింపులను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక సదస్సుకు భారత్‌కు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. తనకు ఫోన్‌ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన పుతిన్‌ అన్ని రంగాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com