మసీదులలో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..మరికొంత కాలం మూసివేత
- July 03, 2020
మనామ:కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులలో సామూహిక ప్రార్ధనలను రద్దు చేసింది బహ్రెయిన్. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ తమ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిజానికి గతంతో పోలిస్తే జూన్ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జనం భౌతిక దూరం పాటించకపోవటం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్యశాఖ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సుప్రీం కౌన్సిల్..మసీదులను మరికొంత కాలం మూసివేయాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రార్ధనలను కూడా రద్దు చేసింది. ప్రతి రెండు వారాలకు ఓ సారి సమావేశమై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలను సమీక్షించుకుంటామని కూడా వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రథినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు