కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు
- July 03, 2020
ముంబై:బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ మృతి చెందారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.
సరోజ్ ఖాన్ కొద్ది రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూసారు.
సరోజ్ ఖాన్‌ను మదర్ ఆఫ్ డ్యాన్స్, కొరియోగ్రఫీ ఆఫ్ ఇండియాగా అభిమానులు పిలిచేవారు. సరోజ్ ఖాన్ 40 ఏళ్ళ కెరియర్‌లో 2000కి పైగా సినిమాలు చేశారు. శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల వంటి స్టార్స్‌కి డ్యాన్స్ నేర్పించారు. దేవదాస్ మూవీలోని 'దోలా రే దోలా', తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన 'ఏక్ దో తీన్', జబ్ వీ మెట్ సినిమాలోని 'యే ఇష్క్ హై' పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి. చివరిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన కళంక్ చిత్రంలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు