లడక్‌లో మోదీ ఆకస్మిక పర్యటన

- July 03, 2020 , by Maagulf
లడక్‌లో మోదీ ఆకస్మిక పర్యటన

లడక్:భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి లేహ్‌కు చేరుకున్నారు. పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే టాప్‌ కమాండర్లతోనూ సమావేశం కానున్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో తాజా పరిస్థితిని సైనికులను అడిగి తెలుసుకోనున్నారు. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్‌కు చెందిన 20 మందిసైనికులు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయపడ్డ సైనికులను సైతం మోదీ పరామర్శించనున్నారు. సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని పర్యటించినట్లు తెలుస్తోంది. ఇక ఇరు దేశాల మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ లద్దాఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com