11 డెస్టినేషన్స్‌కి ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ విమానాల పునరుద్ధరణ

11 డెస్టినేషన్స్‌కి ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ విమానాల పునరుద్ధరణ

దోహా: ఖతార్‌ నేషనల్‌ కెరియర్‌ ఖతార్‌ ఎయిర్‌వేస్‌, అదనంగా 11 డెస్టినేషన్స్‌కి విమానాల్ని పునఃప్రారంభిసోతంది. జులై రెండో వారం చివరి నాటికి మొత్తంగా 430 వీక్లీ విమానాల్ని 65కి పైగా డెస్టినేషన్స్‌కి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వాషింగ్టన్‌, డీసీ, బెర్లిన్‌, లాస్‌ ఏంజెల్స్‌, బోస్టన్‌, బాలి, డెన్‌పసర్‌, బీరట్‌, బెల్‌గ్రేడ్‌, ఎడిన్‌బర్గ్‌, లార్‌నకా, పరాగ్వే మరియు జగ్రెబ్‌ లకు ఇవి అదనం. టొరంటో, అంకారా, జాంజిబార్‌, కిలిమంజారో, తదితర ప్రాంతాలకూ విమాన సర్వీసులు విస్తరించనున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం విదితమే. ఇప్పుడిప్పుడే ఏవియేషన్‌ రంగం పుంజుకుంటోంది.

Back to Top