దుబాయ్ : మానవ హక్కుల కమిషన్ లో 13 మంది మహిళలను నియమించిన సౌదీ రాజు

దుబాయ్ : మానవ హక్కుల కమిషన్ లో 13 మంది మహిళలను నియమించిన సౌదీ రాజు

మహిళా స్వాలంభన దిశగా ఇప్పటికే సంస్కరణలు చేపట్టిన సౌదీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మానవ హక్కుల కమిషన్ లో ఏకంగా 13 మంది మహిళలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సౌదీ రాజు. సౌదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ అవ్వద్ అల్ అవ్వద్..వివిధ రంగాల్లో మహిళలకు ప్రధాన్యం కల్పించటం ద్వారా మహిళా స్వాలంభనకు అవకాశం కల్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. నిజానికి రెండేళ్లకు ముందు సౌదీలో మహిళా స్వేచ్ఛకు అనేక పరిమితులు ఉండేవి. అయితే..పరుషులతో పాటు మహిళలకు కూడా సమానహక్కులు కల్పించేలా 2008 నుంచి సౌదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. మహిళలు సొంతంగా డ్రైవింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే గతంలో సౌదీ మహిళలు ప్రయాణాలు చేయాలన్నా, పాస్ పోర్టు పొందాలన్నా, ఉన్నత చదువులు చదువుకోవాలన్నా..అన్నింటికి ఇంట్లోని పురుషుల అనుమతి తప్పనిసరి. సంస్కరణల్లో భాగంగా మహిళలకు తప్పనిసరిగా ఇంట్లోని పురుషుల అనుమతి అవసరం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ​ 

Back to Top