సౌదీ, యూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్..ఇండియన్స్ నుంచి భారీగా బంగారం పట్టివేత
- July 04, 2020
కరోనాతో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే..స్వదేశానికి వస్తూ భారీగా బంగారంతో ఇండియాకి చేరుకున్న 14 మంది ప్రవాస భారతీయులు ఇండియన్ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. 14 మంది నుంచి Dh7.7 మిలియన్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రస్ అల్ ఖైమా నుంచి ఇండియా చేరుకున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి 9.33 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 45 లక్షలు. సౌదీ నుంచి వచ్చిన మరో 11 మంది నుంచి 22.652 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులను తప్పించుకునేందుకు బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్స్ లో అమర్చారు. అయితే..అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయటంతో బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







