బహ్రెయిన్:కరోనా కట్టడికి సూచనలు అందిస్తున్న డా.వెంకట్ రెడ్డి పల్నాట

- July 05, 2020 , by Maagulf
బహ్రెయిన్:కరోనా కట్టడికి సూచనలు అందిస్తున్న డా.వెంకట్ రెడ్డి పల్నాట

మనామా:సంస్కృతి బహ్రెయిన్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా డా.వెంకట్ రెడ్డి పల్నాటి,  Specialist in Respiratory Care ,ఆయన యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రజలకు కోవిడ్-19 వైరస్ గురించి మాట్లాడుతూ ఈ వైరస్ వ్యాధిని నిరోధించే క్రమంలో కొన్ని సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది.

ఈ మధ్య కోవిడ్-19 వైరస్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న ఈ సమయములో మరియు వ్యాధి వ్యాప్తిని నిరోధించడం క్రమంలో కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది.

1.బయటికి వెళ్లినప్పుడు మరియు 5 మంది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లేదా గుంపులో ఉన్నప్పుడు  లేదా బస్సులో మరియు విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

2.బయట వస్తువు లు ముట్టుకున్నప్పుడు లేదా బస్సులో గాని విమానాల్లో గాని ప్రయాణిస్తున్నప్పుడు శానిటైజర్ ను తప్పకుండా వాడాలి లేదా చేతికి తొడుగులు  వేసుకోవాలి.

3.ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు దూరంగా ఉండడం గాని మాస్కులు ధరించడం గాని తప్పనిసరిగా చేయాలి.

4.ఆఫీసులో కాని మరియు మీటింగ్ లో గాని పాల్గొన్నప్పుడు ఒక మీటరు దూరం లో కూర్చోవడం తో పాటు మాస్కులు ధరించడం మరియు సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలి

5.కోవిడ్-19 వైరస్ను తక్కువ గా అంచనా వేయొద్దు ఈ వ్యాధికి  సంబంధించిన లక్షణాలు  2 నుండి 14 రోజుల మధ్యలో ఎప్పుడైనా బయటపడొచ్చు. ఎవరైనా పాజిటివ్ కేసు తో కాంటాక్ట్ లో ఉన్న మరియు  ఎదురుపడి క్రమంలో వారికి వారు తప్పకుండా స్వీయ నిర్బందన విధించు కోవాలి. లేదంటే మీ ద్వారా ఈ వైరస్ మిగతా వాళ్లకు సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

6.గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు కార్మికులు మరియు వారికి ఇచ్చిన నివాస వసతి గృహాల్లో తప్పకుండా సగటు దూరం పాటించాలి మరియు పుట్టినరోజు పార్టీలు కానీ వారాంతపు డిన్నర్లు కానీ జరుపుకోవడం మంచిది కాదు లేదంటే ఈ వైరస్ ఒకరి ద్వారా ఒకరికి ఎక్కువగా సంక్రమించే అవకాశాలు ఉంటాయి.

7.ఎవరికైనా షుగర్ వ్యాధి,బి.పి గాని మరియు కిడ్నీ మరియు క్యాన్సర్ కు సంబంధించిన మందులు తప్పకుండా వాడాలి మరియు వీరికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల అవసరం లేకుండా బయటకు వెళ్లడం కానీ చేయకూడదు. లేనిచో అత్యధికంగా ఈ వైరస్ను బారినపడే అవకాశాలు ఉంటాయి.

8.వయసు పైబడినవారు అనగా 60 సంవత్సరాల పైన లేదా 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఇంట్లోనే ఉండాలి.

9.ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా కానీ మరియు నడవడం కానీ చేసిన క్రమంలో వ్యాధి రోధకశక్తిని పెంచు కోవడం జరుగుతుంది.

10.ప్రతిరో జు ఆహారం తీసుకునే విషయంలో తాజా కూరగాయలు కానీ ఆకుకూరలు విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి లెమన్ కు సంబంధించిన ఫలాలు తీసుకోవడం చేయాలి మరియు ఆల్కహాలు తీసుకోవడం తగ్గించుకోవటం గానీ లేదా మానేయడం కానీ చేయాలి లేదా దీన్ని తీసుకోవడం వల్ల శరీరం యొక్క రోగనిరోధక శక్తి తగ్గి ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ విధమైన సూచనలు మరియు సలహాలు కానీ పాటించడం వలన ఈ యొక్క కొవిడ్-19 వ్యాధికి దూరంగా ఉండడం మరియు వ్యాధి వ్యాప్తి సంక్రమణ కానీ తగ్గుతుంది ఇవన్నీ పాటించాల్సిందిగా డా.వెంకట్ రెడ్డి పల్నాటి బహ్రెయిన్ నుండి కోరుతున్నారు. ఆయనతో పాటుగా ప్రధాన మంత్రి దగ్గర పని చేస్తున్నటువంటి సీనియర్ ఫిజీషియన్ Dr.P.V Cherian కూడా పాల్గొనడం జరిగింది.


--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com