దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ప్రాంగణం పై హక్కు లేదు.
- February 03, 2016
దుకాణ , ప్రైవేటు యజమానులకు తమ ముంగిట ఉన్న ప్రాంగణం పై వారికి ఏ రిజర్వు హక్కు లేదని,
అది సైతం ప్రజా పార్కింగ్ పరిధి లోనికి వస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖాధికారులు ఒక ప్రకటనలో
తెలిపారు. అత్యధిక శాతం మంది దుకాణ యజమానులు, ప్రైవేటు సంస్థల వారు తమ ఎదుట ఉన్న స్థలం
తమ స్వంతమని , తమ సిబ్బంది మినహా వేరే వారెవరు తమ ఎదుట పార్కింగ్ చేయకూడదని ఆంక్షలు
పెట్టడం సరి కాదని అన్నారు. ప్రజలందిరికి చెందిన ఆ ప్రదేశాలను ఆక్రమించి అది తమకె హక్కుగా
ఉందని వారు వ్యహరించడం నేరమని, ఆ విధంగా ప్రవర్తించిన యజమానుల గూర్చి ఎవరైనా పిర్యాదు
చేస్తే, సంబంధిత దుకాణ, ప్రైవేటు యజమానులకు తక్షణమే 300 ఖతర్ రియళ్లను జరిమానాగా
విధిస్తామని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. వారికి ప్రజా పార్కింగ్ స్థలాలపై ఎటువంటి
చట్టపరమైన హక్కు లేదని వారు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







