అరైవల్స్‌లో ఎయిర్‌పోర్ట్ ట్యాక్సీలకే ఛాన్స్
- February 03, 2016
అయిర్‌పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్లకు శుభవార్త. వారు కోరుకున్నట్లుగానే ఎయిర్‌పోర్ట్ ఎరైవల్స్‌లో ఇక నుంచి వారికి మాత్రమే అవకాశం దొరకనుంది. ఆరెంజ్ ట్యాక్సీలకు ప్రయాణీకుల్ని ఎయిర్‌పోర్ట్ వద్ద దించడం తప్ప, అక్కడినుంచి ప్రయాణీకుల్ని పికప్ చేసుకోవడానికి వీల్లేదు. గత కొంతకాలంగా ఎయిర్‌పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్లు ఈ విషయమై ఆందోళనలు చేస్తూ వచ్చారు. వారి ఆందోళనల్ని రాయల్ ఒమన్ పోలీసులు పరిగణనలోకి తీసుకుని, కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఏ ట్యాక్సీలో వెళ్ళాలనేది ప్రయాణీకుడి ఇష్టమనీ, ఈ తాజా నిబంధన తమకు వ్యతిరేకమని ఆరెంజ్ ట్యాక్సీ డ్రైవర్ ఒకరు చెప్పారు. కానీ, తమ జీవనాధారానికి దెబ్బ తగులుతుందనే ఆందోళన చేశామని ఎయిర్‌పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్ చెప్పారు. ప్రయాణీకుల్ని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేశాక, పికప్ విషయంలో ప్రయాణీకుల బేరసారాలకూ ఆరెంజ్ ట్యాక్సీలు అనుమతిస్తున్నాయని ఆయన అన్నారు. కొత్త విధానం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందిందనీ, మినిస్టర్ ఆఫ్ దివాన్‌కి తదుపరి అప్రూవల్ కోసం వెళ్ళిందని మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ సలీమ్ అల్ ఘమ్మారి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







