సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ మానిటరింగ్‌ కోసం ఇనీషియేటివ్‌

సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ మానిటరింగ్‌ కోసం ఇనీషియేటివ్‌

బహ్రెయిన్: నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ హ్యామన్‌ రైట్స్‌ (ఎన్‌ఐహెచ్‌ఆర్‌), ఓ కొత్త ఇనీషియేటివ్‌ని సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే వర్కర్స్‌ కోసం ఏర్పాటు చేసింది. జులై నుంచి ఆగస్ట్‌ వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్‌ బ్యాన్‌ అమలు కానున్న విషయం విదితమే. వర్కర్స్‌తో బలవంతంగా ఈ సమయంలో పనిచేసేవారిపై చర్యలు తీసుకుంటారు. కాగా, ప్రైవేట్‌ సెక్టార్‌లోని ఎంప్లాయర్స్‌, తమ వర్కర్స్‌కి ఫేస్‌ మాస్క్‌ల్ని అందించాల్సి వుంటుందని ఆదేశాలు జారీ చేసింది ఎన్‌ఐహెచ్‌ఆర్‌. కరోనా వైరస్‌ నేపథ్యంలో వర్కర్స్‌కి ఫేస్‌మాస్క్‌లు అందించాల్సి వుంటుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా వుండే వర్కర్స్‌ని వెంటనే ఐసోలేషన్‌కి తరలించాలని ఆదేశించింది ఎన్‌ఐహెచ్‌ఆర్‌. రెస్ట్‌ రూమ్స్, వెయిటింగ్‌ రూమ్స్ అలాగే చేంజింగ్‌ రూమ్స్ లో రద్దీ లేకుండా చూడడం, వర్క్‌ ప్లేస్‌ని శానిటైజ్‌ చేయడం వంటి చర్యలు తీసుకోవాలి.

 

Back to Top