కువైట్‌ మొబైల్‌ ఐడీ - డిజిటల్‌ సివిల్‌ ఐడీకి ఆమోదం

కువైట్‌ మొబైల్‌ ఐడీ - డిజిటల్‌ సివిల్‌ ఐడీకి ఆమోదం

కువైట్‌ మొబైల్‌ ఐడీ అప్లికేషన్‌ ద్వారా జారీ చేసే డిజిటల్‌ సివిల్‌ ఐడీ కార్డ్‌ని అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేర ట్రాన్సాక్షన్స్‌ కోసం వినియోగించేలా ఆమోదించినట్లు మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ అలాగే మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ క్యాబినెట్‌ ఎఫైర్స్‌ అనాస్‌ అల్‌ సలెహ్‌ చెప్పారు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ (పిఎసిఐ) ఇదివరకే కువైట్‌ మొబైల్‌ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో సివిల్‌ ఐడీని ప్రారంభించింది. సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌ తమ సివిల్‌ ఐడీని స్మార్ట్‌ ఫోన్లలో తీసుకెళ్ళొచ్చు. అధికారిక గెజిట్‌లో డెసిషన్‌ ప్రచురితమయ్యాక, ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

 

Back to Top