బిజినెస్‌లకు కొత్త ట్యాక్స్‌ ఇన్సెంటివ్స్‌ ప్రకటించిన ఒమన్‌

బిజినెస్‌లకు కొత్త ట్యాక్స్‌ ఇన్సెంటివ్స్‌ ప్రకటించిన ఒమన్‌

ఒమన్‌ ట్యాక్స్‌ అథారిటీ, కొత్త ఇంటెన్సివ్స్‌ని బిజినెస్‌లకు ప్రకటించడం జరిగింది. కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ఇన్సెంటివ్స్‌ ఉపయోగపడ్తాయి. డిసెంబర్‌ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లించని పక్షంలో విధించే అడిషనల్‌ ట్యాక్స్‌ని రద్దు చేయడంలో ఇందులో ఓ భాగం. ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెల్లించాల్సిన పన్నుని చెల్లించడానికి వీలు కల్పించారు. అలాగే గడువుని కూడా పెంచడం జరిగింది. డిక్లరేషన్స్‌ మరియు అకౌంట్స్‌ సబ్‌మిట్‌ చేయని కారణంగా విధించే ఫైన్స్‌ అలాగే పెనాల్టీలను కూడా ట్యాక్స్‌ అథారిటీ రద్దు చేసింది. ట్యాక్స్‌ పేయర్స్‌, పోస్ట్‌పోన్‌మెంట్‌పై రిక్వెస్ట్‌లను సబ్‌మిట్‌ చేయడానికి వీలు కల్పించారు.

 

Back to Top