కువైట్:ధృవీకరణ పత్రాల కోసం ఆన్ లైన్ బుకింగ్..

- July 09, 2020 , by Maagulf
కువైట్:ధృవీకరణ పత్రాల కోసం ఆన్ లైన్ బుకింగ్..

కువైట్ సిటీ:వివిధ ధృవీకరణ పత్రాల జారీ కోసం ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించినట్లు కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రవాసీయులు ఇక నుంచి ఎలాంటి ధృవీకరణ పత్రాలు కావాలన్న ముందుగా https://www.mofa.gov.kw/ వెబ్ సైట్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని సూచించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రవాసీయులకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్, అకాడమిక్ సర్టిఫికెట్ ఇలా అన్ని సర్టిఫికెట్ల సేవలు షువైఖ్ లోని విదేశీ వ్యవహారాల ప్రధాన బిల్డింగ్ లో మాత్రమే జారీ చేస్తునట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే..ఆన్ లైన్ అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకునేవారికి కొన్ని సూచనలు చేశారు. దరఖాస్తుదారుడు అపాయింట్మెంట్ బుకింగ్ స్లాట్ సమయానికి ఆఫీస్ కు చేరుకోవాలని, ఆ తర్వాత ఓ 15 నిమిషాలు ఆలస్యంగా వారికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 15 నిమిషాలు దాటితే దరఖాస్తుదారుడి అపాయింట్మెంట్ రద్దు అవుతుంది. అలాగే కరోనా నేపథ్యంలో ప్రతి దరఖాస్తుదారుడు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. టెంపరేచర్ 37.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే వారిని ఎట్టిపరిస్థితుల్లో లోనికి అనుమతించరు. అలాగే పరిపాలన విభాగాల్లోకి దరఖాస్తుదారుడు వెళ్లకూడదు. ఇక విజిటర్లు ఖచ్చితంగా తాము ఏ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలను వారే తమ వెంట తీసుకురావాలి. అఫీసులో ఫోటోకాపీ సౌకర్యం కల్పించటం లేదని కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com