అబుధాబిలో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు పున:ప్రారంభం..
- July 09, 2020
అబుధాబి:కరోనా ఎఫెక్ట్ తో గత మార్చి నుంచి నిలిచిపోయిన పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అబుధాబిలోని భారత రాయబారి కార్యాలయం ప్రకటించింది. పాస్ పోర్ట్ సేవలపై ఇప్పటివరకు ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 15 నుంచి అబుధాబిలోని అన్ని బీఎల్ఎస్ కేంద్రాల్లో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు అందుబాటులోకి వస్తాయని రాయబార కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. అయితే..60 ఏళ్లు దాటిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం వ్యక్తిగతంగా హజరుకావాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఆఫీసుకు హజరయ్యేవారు మాత్రం ఖచ్చితంగా కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజ్ ధరించాలని..భౌతిక దూరం పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష