మూడంకెల నెంబర్ ప్లేట్ విలువ BD1,00,000...
- July 09, 2020
మనామా:వారసత్వంగా వచ్చిన వాహన నెంబర్ ప్లేట్ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. మేనత్తా, అల్లుళ్ల మధ్య తగువుకు కారణమైంది. చివరికి విషయం కోర్టు వరకు వెళ్లింది. బహ్రెయిన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బహ్రెయిన్ కు చెందిన ఓ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో ఓ వాహనం కూడా ఉంది. ఆ వాహనం పాతబడినప్పటికీ ఆ వాహనం నెంబర్ మూడంకెల సెంటిమెంట్ తో ముడిపడి ఉండటంతో దానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీంతో సెంటిమెంట్ ను క్యాష్ చేసుకున్న ఓ మహిళ..మిగిలిన బంధువులకు తెలియకుండా ఆ నెంబర్ ప్లేట్ ను BD 1,00,000 ధరకు అమ్మేసింది. దీంతో ఆ మహిళ మేనళ్లుల్లు తమ వాటా కోసం కోర్టును ఆశ్రయించారు. వారసత్వంగా వచ్చిన వాహనం నెంబర్ ప్లేట్ ను ఏ ధరకు అమ్మారో అల్లుళ్లకు కూడా తెలియజేయాలన్న సుప్రీమ్ అప్పీల్స్ కోర్టు.. ..నెంబర్ ప్లేట్ వారసత్వంగా వచ్చిన ఆస్తిలో భాగమే కనుక అలుళ్లకు కూడా భాగం ఇవ్వాలన్న కింది కోర్టు తీర్పును సమర్ధించింది. అల్లుళ్లకు BD 61,000 చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు