కువైట్ లో ఘనంగా రాజన్న 71వ జయంతి వేడుకలు
- July 09, 2020
కువైట్ సిటీ:దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71 వ జయంతి వేడుకలు వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మరియు, కమిటీ సభ్యుల ఆధ్వర్యాంలో,కువైట్ లోని సాల్మియా ప్రాంతంలో గల గల్ఫ్ బాబాయి న్యూస్ ఛానల్ వారి కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ముమ్మిడి బాలిరెడ్డి చేతుల మీదుగా రాజన్న చిత్ర పటానికి పూలమాల వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యుల తరుపున శ్రధ్ధాంజలి ఘటించారు.
ప్రవాసాంధ్రులకు నిత్యావసర సరుకుల పంపిణీ
రాజన్న జయంతి సందర్భంగా రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి సహకారంతో కరోనా వైరస్ కారణంగా,కువైట్ లో లాక్ డౌన్ విధించిన ప్రాంతాలలో పనులు లేక ఇబ్బందిపడుతున్న ప్రవాసాంధ్రులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ ఫథకాలు అమలు చేసిన తీరు, బడుగుబాలహీన వర్గాల ప్రజలకు ఆయన చేసిన మేలు మరువరానిదని కొనియాడినారు.యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి అడుగుజాడలలో నడుస్తు,ఆయనంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ కో-కన్వీనర్లు,గోవిందు నాగరాజు,యం.వి నరసారెడ్డి, ప్రధాన కోశాధికారి,నాయిని మహేశ్వర రెడ్డి , సలహాదారులు,నాగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి, అబుతురాబ్,బి సి విభాగం అధ్యక్షులు, రమణయ్య యాదవ్, మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ గఫార్, ఎస్సీ ఎస్టీ విభాగం అధ్యక్షులు, బి.ఎన్ సింహా, సేవాదల్ ఇన్చార్జ్ గోవింద రాజు, కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి , గడికోట రాజా,యువజన విభాగం సభ్యులు,షేక్ సబ్దర్,హరి ప్రసాద్ చౌదరి, పి.రవి శంకర్, ప్రభాకర్ పోలూరు మరియు APNRTS కువైట్ వాలంటీర్లు, సురేష్ రెడ్డి, కే.ఈశ్వరమ్మ,అరుణ్ రెడ్డి, షరిఫ్, మరియు అనుబంధ సంఘాల నాయకులు, ఏపీఎన్ఆర్టీఎస్ కువైట్ సభ్యులు ,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు