సౌదీ అరేబియా:పబ్లిక్ ప్రాంతాల్లో షిషా, బార్బెక్యూపై నిషేధం
- July 11, 2020
రియాద్:పబ్లిక్ ప్రాంతాల్లో బార్బెక్యూ(మాంసాన్ని మంటపై కాల్చటం), షిషా నిర్వహణను సౌదీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి ఎవరైన పార్కులు, గ్రౌండ్స్ లాంటి పబ్లిక్ ప్రాంతాల్లో బార్బెక్యూ కోసం మంట పెట్టినా, షిషా(హుక్కా) నిర్వహించినా స్పాట్ లోనే ఫైన్ వేస్తామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి తొలిసారిగా 100 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తామని, రెండో సారి కూడా నిషేధాన్ని ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానా అంటే 200 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తామని సౌదీ పురపాలక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బార్బెక్యూ కోసం మంట వెలగించటం ద్వారా నిర్వాహకులతో పాటు ప్రజలకు హాని పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







