సింగపూర్లో మళ్లీ అధికార పార్టీకే పట్టం కట్టిన ప్రజలు
- July 11, 2020
సింగపూర్:సింగపూర్లో శుక్రవారం జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ అధికార పార్టీకే పట్టం కట్టారు. అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) 61.2 శాతం ఓట్లతో విజయం సాధించింది. పార్లమెంటులోని మొత్తం 93 స్థానాల్లో.. 83 సీట్లను పీఏపీ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ 10 స్థానాలను సొంతం చేసుకుంది. కాగా, అధికార పార్టీకి 2015లో 71 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం 10 శాతం ఓట్లు తగ్గాయి.
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సింగపూర్ దేశంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ముఖానికి మాస్క్, చేతులకు గ్లోజులు ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఓటింగులో పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో 2.65 మిలియన్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికార పీఏపీ సింగపూర్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రస్తుత ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్ మరోసారి పదవిని చేపట్టనున్నారు.
అధికార పీఏపీ దేశంలో 1959 నుంచి అధికారంలో కొనసాగుతున్నది. సింగపూర్ పితామహుడిగా పిలుచుకునే లీ కువాన్ యూ దేశ ప్రధానిగా 1990 వరకు కొనసాగారు. ప్రస్తుత ప్రధాని లీ సీన్ లూన్ 2004 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని ఆయన ప్రకటించారు.సింగపూర్ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పార్టీ జెండాలు చేతబట్టుకొని విజయోత్సవం జరుపుకున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









