సైబరాబాద్:పోలీసు కుటుంబాలతో సీపీ వీసీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్
- July 11, 2020
సైబరాబాద్:కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసు కుటుంబ సభ్యులు సమాజహితం కోసం మరింత విశ్వాసంతో, నిర్మాణాత్మకంగా ఆలోచించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 500 మంది పోలీసు కుటుంబ సభ్యులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మానసికంగా బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా పోలీసుల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప్పు నీరు, గోరు వెచ్చని తాగడం, తాజా ఆహారాన్ని తీసుకోవడం, విటమిన్ టాబ్లెట్లు తీసుకోవాలని సూచించారు. ఏమైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలను అనుసరించాలని సీపీ తెలిపారు.


తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







