పరాయి దేశస్థురాలిని వివస్త్రను చేసి.. కొట్టి చంపిన ఘటన : బెంగళూరు
- February 03, 2016
సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన ఒకటి బెంగుళూరు నగరంలో జరిగింది. ఓ రోడ్డు ప్రమాదానికి వారే కారణమని భావించిన ఓ ముఠా.. పరాయి దేశస్థురాలిని వివస్త్రను చేసి.. కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బెంగళూరు నగరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 యేళ్ల మహిళ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరో తెలియదు. వారికోసం మృతురాలి బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసమయంలోనే టాంజానియా దేశానికి చెందిన ఓ మహిళ, ఆమె స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఆ గుంపు ప్రమాదానికి కారణం వారే అనుకుని దాడికి పాల్పడ్డారు. బెంగళూరులో చదువుతున్న ఆ విద్యార్థినిని బయటకులాగి చేయిచేసుకోవడంతోపాటు ఆమెను వివస్త్రను చేసి పరుగులు పెట్టించారు. ఆమె స్నేహితులపై దారుణంగా దాడి చేశారు. అనంతరం వారి కారును తగులబెట్టారు. అయితే, ఆ యాక్సిడెంట్ చేసింది మాత్రం సుడాన్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి న్యాయం చేసే చర్యలకు దిగారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







