ఏపీలో కొత్తగా 1914 కరోనా పాజిటివ్ కేసులు
- July 12, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 18 మంది, విదేశాల నుంచి వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 846 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం15,412 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కర్నూలులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు.. చిత్తూరు,నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం 19 మంది మరణించారు. ఇప్పటి వరకు ఏపీలో 328 మంది కరోనా వైరస్ సోకి మృతిచెందారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 17,624 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటివరకు 11,53,849 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 13,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







