దుబాయ్ నుంచి విజయవాడ చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్

- July 12, 2020 , by Maagulf
దుబాయ్ నుంచి విజయవాడ చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్

దుబాయ్: APNRTS మరియు Costa ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు దుబాయ్ నుంచి 172 మంది ప్రవాసాంధ్రులు విజయవాడ కు చేరుకున్నారు. గత కొన్ని రోజులనుంచి ఈ రోజు వరకు APNRTS వారి ఆధ్వర్యంలో 10 విమాన సర్వీసులు హైదరాబాద్-2 విశాఖపట్నం-2, విజయవాడ-6 విమానాల ద్వారా, తదితర ప్రాంతాలకు 1690 మంది ప్రవాసాంధ్రులు దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూ.ఏ.ఈ కన్వీనర్ మరియు APNRTS దుబాయ్ ప్రొవిజనల్ కో-ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

ప్రవాసాంధ్రులను త్వరితగతిన స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన యవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,APNRTS ఛైర్మన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com