హైదరాబాద్ లో కరోనా హైరిస్క్ ప్రాంతాలు
- July 13, 2020
హైదరాబాద్:కొన్ని రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా నమోదవుతూ వచ్చాయి.అయితే, రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.కేసులు తగ్గుముఖం పడుతున్నా,తీవ్రత నగరంలో ఎక్కువగా ఉండటంతో వైద్యశాఖాధికారులు నగరంపై దృష్టి పెట్టారు.500 కేసుల కంటే అధికంగా నమోదైన ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు.నగరంలో ఇలాంటి హైరిస్క్ ప్రాంతాలు 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు.యూసఫ్ గూడ, అంబర్ పేట, మెహదీపట్నం, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్ ప్రాంతాలుగా గుర్తించారు.ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని GHMC భావిస్తోంది.ఒక్కో హైరిస్క్ ప్రాంతంలో కేసుల నమోదును దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 20 వరకు మొత్తంగా 8 ప్రాంతాల్లో 100 వరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు GHMC రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







