యూఏఈలోని విజిట్ విసాదారులకు నెల రోజుల డెడ్ లైన్..
- July 14, 2020
యూఏఈ:విజిట్ వీసాపై యూఏఈలో ఉన్న పర్యాటకులకు ఆ దేశ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. నెల రోజుల్లోగా విజిట్ విసాను రెన్యూవల్ చేసుకోవాల్సిందేనని డెడ్ లైన్ విధించింది. లేదంటే దేశం విడిచి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. ఈ నెల 12 నుంచి వీసాలు, గుర్తింపు కార్డులు, నివాస అనుమతుల విషయంలో కొత్త విధివిధానలను అమలులోకి వచ్చిన నేపథ్యంలో యూఏఈ ఈ ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల వీసాలు, నివాస అనుమతులను ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే..ఇటీవలె సమావేశమైన యూఏఈ మంత్రిమండలి..వీసా గడువుల విషయంలో ఇచ్చిన మినహాయింపులన్నింటిని ఉపసంహరించుకుంది. దీంతో జులై 11 నాటికి వీసాలు, నివాస అనుమతులపై అన్ని రకాల మినహాయింపులు రద్దయిపోయాయి. అయితే..ఇప్పటికే దేశంలో ఉన్న ప్రవాసీయులకు మాత్రం డాక్యుమెంట్ల రెన్యూవల్ కు మూడు నెలల మినహాయింపు ఇచ్చింది. అలాగే లాక్ డౌన్ తో విదేశాల్లోనే చిక్కుకుపోయిన నివాసితులు..యూఏఈకి వచ్చిన నాటి నుంచి నెల రోజుల్లోగా నివాస అనుమతులను రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..