మస్కట్:అవసరమైన కుటుంబాలకు పాత ఏసీల స్థానంలో కొత్త ఏసీల ఏర్పాటు
- July 14, 2020
మస్కట్:ఓమన్ లో అర్హులైన కుటుంబాలకు ఉచితంగా ఏసీలను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ నియంత్రణ అథారిటీ ఆధ్వర్యంలో ఓమన్ ఎన్విరాన్వెమెంటల్ సర్వీస్ హోల్డింగ్ కంపెనీ దర్ అల్ అట్టా అనే స్వచ్ఛంద సంస్థ పాత ఏసీల స్థానంలో కొత్త ఏసీలను ఉచితంగా ఏర్పాటు చేయనుంది. సమాజానికి తోడ్పాటుగా ఉండటం తాము బాధ్యతగా భావిస్తున్నామని విద్యుత్ నియంత్రణ అథారిటీ వెల్లడించింది. అయితే..కొత్త ఏసీల ఏర్పాటు విషయంలో దార్ అల్ అట్టా సంస్థ కొన్ని విధివిధానాలను రూపొందించుకొని ఆ మేరకు అర్హులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం పదేళ్లకు మించి పాతబడిన ఏసీల స్థానంలో మాత్రమే కొత్త ఏసీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. పాత ఏసీల కారణంగా ఆయా కుటుంబాలకు విద్యుత్ వినియోగం పెరుగుతోందని, వాటి స్థానంలో కొత్త ఏసీలను ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం