మార్స్ మిషన్‌ని వాయిదా వేసిన యూఏఈ
- July 14, 2020
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ప్రోబ్ మిషన్ టు మార్స్ వాయిదా పడింది. జపాన్‌లో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతోనే ఈ వాయిదా జరిగినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ వెల్లడించింది.కాగా, జులై 17న యూఏఈ మిషన్ టు ఎక్స్ప్లోర్ మార్స్‌ని లాంఛ్ చేసే అవకాశం వుంది. మార్స్ప్రోబ్ని ఎంబిఆర్‌ఎస్‌సి - మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సంయుక్తంగా రూపొందించాయి. ‘హోప్’ పేరుతో ఓ ప్రోబ్ని వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు వీలుగా రూపొందించారు. ఓ కారు సైజ్‌లో ఈ స్పేస్ క్రాఫ్ట్ వుంటుంది. 2021 జనవరి - మార్చి మధ్యలో ఈ ప్రోబ్, మార్స్‌ని చేరుకోనుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే, మొట్టమొదటి అరబ్ మిషన్‌గా దీనికి పేరు దక్కుతుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు