మార్స్‌ మిషన్‌ని వాయిదా వేసిన యూఏఈ

- July 14, 2020 , by Maagulf
మార్స్‌ మిషన్‌ని వాయిదా వేసిన యూఏఈ

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన ప్రోబ్‌ మిషన్‌ టు మార్స్‌ వాయిదా పడింది. జపాన్‌లో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతోనే ఈ వాయిదా జరిగినట్లు మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ స్పేస్‌ సెంటర్‌ వెల్లడించింది.కాగా, జులై 17న యూఏఈ మిషన్‌ టు ఎక్స్‌ప్లోర్‌ మార్స్‌ని లాంఛ్‌ చేసే అవకాశం వుంది. మార్స్‌ప్రోబ్‌ని ఎంబిఆర్‌ఎస్‌సి - మిట్‌సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా రూపొందించాయి. ‘హోప్‌’ పేరుతో ఓ ప్రోబ్‌ని వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు వీలుగా రూపొందించారు. ఓ కారు సైజ్‌లో ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ వుంటుంది. 2021 జనవరి - మార్చి మధ్యలో ఈ ప్రోబ్‌, మార్స్‌ని చేరుకోనుంది. ఈ మిషన్‌ సక్సెస్‌ అయితే, మొట్టమొదటి అరబ్‌ మిషన్‌గా దీనికి పేరు దక్కుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com