భారత్, ఇరాన్ ల మధ్య చేజారిన భారీ ఒప్పందం..
- July 14, 2020
నాలుగేళ్ల క్రితం చాబహార్-జహేదాన్ మధ్య రైలు మార్గం వేయడానికి భారత్, ఇరాన్ ల మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 3,015 కోట్ల రూపాయల వ్యయంతో 2022 నాటికి భారత్ ఈ మార్గాన్ని నిర్మించాలనేది ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం. కానీ నిధులివ్వడంలో భారత్ జాప్యం చేస్తుండడం వల్లే తామే సొంతంగా నిర్మించుకుంటామని ఇరాన్ పేర్కొంది. ఆప్ఘానిస్థాన్ బోర్డర్ ను ఆనుకుంటూ వెళ్లే 628 కిలోమీటర్ల ఈ రైలు మార్గం అత్యంత కీలకమైంది. భవిష్యత్తులో ఈ మార్గాన్ని జరంజ్ కు విస్తరిస్తామని ఇరాన్ రవాణా మంత్రి మహమ్మద్ ఇస్లామీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్, చైనాల మధ్య 30 లక్షల కోట్ల రూపాయల ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి.
దీని ప్రకారం వచ్చే 25 ఏళ్లలో ఈ మొత్తాన్ని ఇరాన్ లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు చైనా ఖర్చు చేస్తుంది. చైనా రాకతోనే ఇరాన్, ఇండియాను పక్కన పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరితే డ్రాగన్ దేశ చాబహార్ పోర్టును ఎలాంటి పన్నులు కట్టకుండా వాడుకోవచ్చు. ఇక పోర్టు నిర్మాణంలోనూ చైనా కీలక పాత్ర పోషించనుందని సమాచారం. అయితే చాబహార్ పోర్ట్ నిర్మాణంలో చైనా పాత్ర ఉందనే వార్తలను ఇరాన్ అధికారులు ఖండిస్తున్నారు. కాగా చాబహార్ రైల్వే ప్రాజెక్టును కోల్పోవడం భారత్ కు దౌత్యపరంగా పెద్ద దెబ్బ అని కాంగ్రెస్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన