తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స...

- July 15, 2020 , by Maagulf
తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స...

హైదరాబాద్:తెలంగాణలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.కరోనా వైరస్‌కు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందించారు. కానీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి సంఖ్య పెరగడంతో ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిలిచ్చారు. దీంతో అధిక శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్సకు వేసే బిల్లుల పట్ల తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. దీనికితోడు పాజిటివ్ కేసులు పల్లెల్లోకి పాకిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్స ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అందుకోసం మొదటగా 3 ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఎంపిక చేశారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమతా మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా పరీక్షలు, కరోనా చికిత్స ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అనంతరం ఈ ఉచిత సేవలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com