ట్యాక్సీ ధరల పెంపుపై వ్యతిరేకత
- February 04, 2016
ట్యాక్సీ టారిఫ్ పెంపుపై లోకల్ ట్యాక్సీ డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ కమల్ అహ్మద్ ఇటీవలే టారిఫ్ పెంపుపై సంకేతాలు ఇచ్చారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా టారిఫ్‌లను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయనీ, ప్యాసెంజర్లు కూడా ఇదే మాట చెప్తున్నారన్న క్యాబ్ డ్రైవర్లు ఇంకా టారిఫ్ పెంచితే ట్యాక్సీ డ్రైవర్లు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. బహ్రెయినీ టాక్సీ పేరుతో లోకల్ ట్యాక్సీ డ్రైవర్లు సోషల్ మీడియాలో ఓ పేజ్ క్రియేట్ చేసి, దాని ద్వారా వీడియోలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నారు. సామాన్యులు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్నారనీ, ట్యాక్సీని లగ్జరీగా భావించి దూరమయ్యే అవకాశం ఉందని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తన ఆవేదనను తీసుకెళ్ళాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







