టర్కీ:విమాన ప్రమాదంలో ఏడుగురు మృతి

- July 16, 2020 , by Maagulf
టర్కీ:విమాన ప్రమాదంలో ఏడుగురు మృతి

టర్కీలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలడంతో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు. టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగులు ఎత్తులో వస్తున్న విమానం ఈ ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు తెలియజేశారు. విమానం బయలుదేరిన కొద్ది సమయంలోనే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదని తెలిపారు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని.. త్వరలేనే అన్ని విషయాలు వెల్లడిస్తామని మంత్రి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com