బహ్రెయిన్:అర్హత లేకుండానే బోటాక్స్, కాస్మోటిక్ ట్రీట్మెంట్..డాక్టర్లపై చర్యలు

- July 19, 2020 , by Maagulf
బహ్రెయిన్:అర్హత లేకుండానే బోటాక్స్, కాస్మోటిక్ ట్రీట్మెంట్..డాక్టర్లపై చర్యలు

మనామా:సరైన అనుమతులు లేకుండానే కాస్మోటిక్ ట్రీట్మెంట్ అందిస్తున్న పలు ఆస్పత్రులు, డాక్టర్లపై బహ్రెయిన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అర్హతలు లేకుండా బోటాక్స్(తేజోవంతంగా కనిపించేందుకు చేసే ట్రీట్మెంట్), డెర్మల్ ఫిల్లర్స్ చేస్తున్నట్లు జాతీయ ఆరోగ్య నియంత్రణ అధికార విభాగం వెల్లడించింది. అక్రమంగా బోటాక్స్ నిర్వహిస్తున్న డాక్టర్లను న్యాయవిచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే సరైన అనుమతులు లేకుండా కాస్మోటిక్ ట్రీట్మెంట్ అందిస్తున్న ఐదు ఆస్పత్రులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బహ్రెయిన్ లో ఎవరైనా సరైన అనుమతులు లేకుండా, అర్హత లేకుండా ప్రజలకు ట్రీట్మెంట్ అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెడికల్ విభాగానికి సంబంధించి సేవలు అందించాలనుకునే వారు..సంబంధిత విభాగాల నుండి లిఖిత పూర్వక అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అనుమతుల కోసం ఆయా డాక్టర్లు వారు చేసిన కోర్సు సర్టిఫికెట్లను [email protected] మెయిల్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అర్హత లేని డాక్టర్లను గుర్తించేందుకు ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. https://www.nhra.bh/Departments/HCP/?page=68 లింక్ ద్వారా ఎవరెవరికి లైసెన్స్ ఉన్నాయో తెల్సుకోవచ్చని NHRA అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com