దేశం వెలుపల ప్రయాణాలకు ఖతార్ అనుమతి
- July 22, 2020
దోహా:పౌరులు అలాగే నివాసితులు కతార్ వెలుపల ఇతర దేశాలకు వెళ్లడం లేదా ఇతర దేశాల నుంచి రావడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటిదాకా వున్న ఆంక్షల్ని సడలించింది. ఆగస్ట్ 1 నుంచి వేరే దేశాలకు వెళ్ళేందుకు, వేరే దేశాల నుంచి వచ్చేందుకూ వీలుగా ఖతార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కతార్ సమాచార కార్యాలయం (జిసిఓ) ఓ ప్రకటన చేసింది. కరోనా వైరస్‌కి సంబంధించి తక్కువ తీవ్రత వున్న దేశాలకు వెళ్ళేందుకు, అట్నుంచి వచ్చేందుకు ప్రయాణీకులకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు ఆయా దేశాల తాలూకు వివరాల్ని మినిస్ట్రీకి చెందిన ప్రజారోగ్య విభాగం తాలూకు వెబ్సైట్లో వివరాల్ని పొందు పరుస్తారు. ప్రతి రెండు వారాలకూ వీటిని సమీక్షిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలూ తీసుకుంటారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు