దేశం వెలుపల ప్రయాణాలకు ఖతార్ అనుమతి

- July 22, 2020 , by Maagulf
దేశం వెలుపల ప్రయాణాలకు ఖతార్ అనుమతి

దోహా:పౌరులు అలాగే నివాసితులు కతార్‌ వెలుపల ఇతర దేశాలకు వెళ్లడం లేదా ఇతర దేశాల నుంచి రావడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటిదాకా వున్న ఆంక్షల్ని సడలించింది. ఆగస్ట్‌ 1 నుంచి వేరే దేశాలకు వెళ్ళేందుకు, వేరే దేశాల నుంచి వచ్చేందుకూ వీలుగా ఖతార్  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కతార్‌ సమాచార కార్యాలయం (జిసిఓ) ఓ ప్రకటన చేసింది. కరోనా వైరస్‌కి సంబంధించి తక్కువ తీవ్రత వున్న దేశాలకు వెళ్ళేందుకు, అట్నుంచి వచ్చేందుకు ప్రయాణీకులకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు ఆయా దేశాల తాలూకు వివరాల్ని మినిస్ట్రీకి చెందిన ప్రజారోగ్య విభాగం తాలూకు వెబ్‌సైట్‌లో వివరాల్ని పొందు పరుస్తారు. ప్రతి రెండు వారాలకూ వీటిని సమీక్షిస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలూ తీసుకుంటారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com