సౌదీ:ప్రవాసీయులు ఇకపై ఆన్ లైన్ లోనే స్పాన్సర్ షిప్ బదిలీ చేసుకునే వెసులుబాటు

- July 23, 2020 , by Maagulf
సౌదీ:ప్రవాసీయులు ఇకపై ఆన్ లైన్ లోనే స్పాన్సర్ షిప్ బదిలీ చేసుకునే వెసులుబాటు

రియాద్:ప్రవాసీయులు తమపై ఆధాపడిన వారి స్పాన్సర్ షిప్ ను ప్రైవేట్ సెక్టార్, సంస్థలకు బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఇకపై మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాంచి ఆఫీసులకు వెళ్లకుండానే స్పాన్సర్ షిప్ బదిలీ ప్రక్రియ పూర్తి చేసేలా ఆన్ లైన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఇందుకు సంబంధించి విధివిధానాలను కూడా ఖరారు చేసింది. తమపై ఆధారపడిన వారికి స్పాన్సర్ షిప్ ను బదిలీ చేయాలనుకునే ప్రవాసీయులు సౌదీ మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ పోర్టల్ లోని రిక్వెస్ట్ ఐకాన్ ను ఎంచుకోని తగిన ఫార్మాట్ లో దరఖాస్తు చెయాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు ఫామ్ సమర్పించిన తర్వాత గార్డియన్ అనుమతి పెండింగ్ లో ఉంది అనే స్టేటస్ కనబడుతుంది. ఆ తర్వాత సదరు ప్రవాసీయుడు నేషనల్ యాక్సెస్ సర్వీస్ ను ఎంటర్ చేసి బదిలీకి సమ్మతిస్తున్నట్లుగానీ, తిరస్కరిస్తున్నట్లుగానీ ఉన్న అప్షన్ లను ఎంచుకోవాలి.

సదరు ప్రవాసీయుడు స్పాన్సర్ షిప్ బదిలీకి సమ్మతిస్తూ ఆప్షన్ ఎంచుకున్నట్లైతే..ఆ దరఖాస్తు అంతర్గత మంత్రిత్వ శాఖ అనుమతికి బదిలీ అవుతుంది. మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ప్రవాసీయుడు తన స్పాన్సర్ షిప్ ను ఏ సంస్థకు, ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయాలనుకుంటున్నాడో సదరు సంస్థ ప్రతినిధులు 14 రోజుల్లోగా సంబంధిత పాస్ పోర్ట్ డైరెక్టరేట్ బ్రాంచికి వెళ్లి మిగిలిన ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు సంస్థ నిర్ణీత గడువులోగా పాస్ పోర్టు కార్యాలయాన్ని సంప్రదించకుంటే..స్సాన్సర్ షిప్ బదిలీ ప్రక్రియ రద్దు అవుతుంది.

ప్రవాసీయులు తమపై ఆధాపడిన వారికి స్పాన్సర్ షిప్ బదిలీ చేసే సమయంలో కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. డిపెండెంట్స్ ఐడీ కార్డు పేరు మీద మంత్రిత్వ శాఖ నిర్ణయించిన ఫీజును బ్యాంకులో జమ చేయాలి. అలాగే డిపెండెంట్ వయస్సు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అతను స్పాన్సర్ ఫిప్ సర్వీసులు నిషేధించిన ఏ ఇతర దేశానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు. అలాగే డిపెండెంట్ కు సరైనా రెసిడెన్సీ పర్మిట్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు..స్పాన్సర్ షిప్ బదిలీ చేసే ప్రవాసీయుడు ప్రస్తుతం కింగ్ డమ్ లో పని చేస్తుండాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com