ఒమన్‌లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
- July 26, 2020
మస్కట్:ఒమన్‌లో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.శనివారం ఒక్కరోజే ఒమన్‌లో 1,067 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఒమన్-959 పౌరులుంటే.. మిగతా విదేశీయులు-108 ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 74,858కు చేరింది. అయితే, నిన్న ఒకేరోజు 1,054 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడం ఊరటనిచ్చే విషయం.
దీంతో ఇప్పటివరకు ఒమన్ దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం రికవరీలు 54,061కు చేరాయి.శనివారం సంభవించిన 12 మరణాలతో కలిపి ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కాటుకు బలైన వారు 371 మంది అయ్యారు. మరోవైపు ఒమన్ ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తోంది. ఒమాన్ లో కరోనా మహమ్మారిని కట్టడి చెయ్యటానికి నిన్నటి నుండి లాక్ డౌన్ అమలు చేసారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు