ప్రయాణీకులకు భారీ కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న 'ఎమిరేట్స్' ఎయిర్లైన్స్

- July 26, 2020 , by Maagulf
ప్రయాణీకులకు భారీ కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న \'ఎమిరేట్స్\' ఎయిర్లైన్స్

యూఏఈ: దుబాయ్ కు చెందిన ఎమిరేట్స్ విమానయాన సంస్థ లో యూఏఈ కు వస్తున్నా, లేదా యూఏఈ నుండి ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు COVID-19 సంబంధిత వైద్య ఖర్చులు మరియు నిర్బంధ ఖర్చులు తాము భరిస్తామని ప్రకటించింది ఎమిరేట్స్. దీంతో ప్రపంచంలోనే COVID-19 సంబంధిత ఖర్చులకు ఉచిత, గ్లోబల్ కవర్ అందించే మొదటి విమానయాన సంస్థగా రికార్డు సృష్టించింది ఎమిరేట్స్.

ప్రయాణిస్తున్న సమయంలో కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్లయితే, ప్రయాణీకుని వైద్య ఖర్చులకు 150,000 యూరోలు(షుమారు 642,000 దిర్హాములు) మరియు 14 రోజుల క్వారంటైన్ ఖర్చుల నిమిత్తం రోజుకు 100 యూరోలు (షుమారు 430 దిర్హాములు) ఎమిరేట్స్ సంస్థ భరించనుంది. ప్రయాణ సమయంలో COVID-19 తో బాధపడుతున్న వారు సహాయం మరియు కవర్ పొందటానికి ప్రత్యేక హాట్‌లైన్‌ను సంప్రదించాలి. వివరాలు ఎయిర్లైన్స్ వెబ్‌సైట్‌లో పొందుపరచటం జరిగింది.

వినియోగదారులు ప్రయాణించే ముందు ఎటువంటి ఫారమ్‌లను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసినట్లయితే, ఎమిరేట్స్ అందించే ఈ కవర్‌ను ఉపయోగించుకునే అవకాశం కోల్పోతారు అని సంస్థ తెలిపింది.

ఎకానమీ/బిజినెస్/ఫస్ట్ క్లాస్ తో సంబంధం లేకుండా అందరికీ ఈ ఉచిత, గ్లోబల్ కవర్ వర్తిస్తుంది.

ఈ కవర్ 31 అక్టోబర్ 2020 వరకు ఎమిరేట్స్‌లో ప్రయాణించే వినియోగదారులకు వర్తిస్తుంది. మొదటి ప్రయాణం ఈ ఏడాది అక్టోబర్ 31 న లేదా అంతకు ముందే పూర్తి కావాలి. ప్రయాణంలో మొదలైన క్షణం నుండి 31 రోజులు ఈ కవర్ చెల్లుతుంది. దీని అర్థం ఎమిరేట్స్ కస్టమర్లు తమ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మరొక నగరానికి ప్రయాణించినప్పటికీ, ఈ కవర్ యొక్క అదనపు హామీ నుండి లాభం పొందడం కొనసాగించవచ్చు.

"ప్రపంచవ్యాప్తంగా సరిహద్దులు క్రమంగా తిరిగి తెరవబడుతున్నాయి..ప్రజలు ప్రయాణించేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నారు..కాని ఈ కరోనా సమయంలో ప్రయాణంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయేమో అనే ఆందోళన ప్రయాణీకులను వెంటాడుతోంది. దుబాయ్ రాజు షేఖ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం ఆదేశాలమేరకు ఎమిరేట్స్ విమానయాన సంస్థ తమ ప్రయాణీకుల ఆందోళనలను పారద్రోలి వారికి ప్రయాణం పై విశ్వాసం కలిగించేందుకు ఈ గ్లోబల్ కవర్ ను ఉచితంగా అందిస్తున్నాం” అని తెలిపారు దుబాయ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ మరియు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అండ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com