గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన దేవిశ్రీ ప్రసాద్
- July 28, 2020
చెన్నై:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన వన యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కోట్ల గుండెలను తాకుతుంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పేరు వినిపిస్తే చాలు ప్రకృతిని ప్రేమించే సెలబ్రెటీలంతా పరవశించిపోతున్నారు. ఛాలెంజ్ రావడమే ఆలస్యం తమ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు.
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి,ఇచ్చిన పిలుపును స్వీకరించిన *“టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్” ఈ రోజు చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం, తన స్నేహితులు చెన్నై బ్యూటీ శ్రుతిహాసన్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లకు హరిత సవాల్ విసిరారు.
ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారిని మనసారా అభినిందిస్తున్నట్టు దేవీ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. దేవీశ్రీ ప్రసాద్ చొరవకు సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క పిలుపునందుకొని మొక్కలు నాటి కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు నామినేట్ చేయడం పట్ల హారీశ్ శంకర్, శ్రుతీహాసన్ లు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే తన మూడు మొక్కలు నాటి కర్తవ్యాన్ని నెరవేరుస్తామని తెలియజేశారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







