పుట్టినరోజు సందర్భంగా మంతెన వెంకట రామరాజు భారీ వితరణ!
- July 29, 2020
'వసుధ ఫౌండేషన్' పేరిట దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు విరాళమిస్తూ... సేవాసంపన్నుడిగానూ వినుతి కెక్కిన ప్రముఖ పారిశ్రామికవేత్త మంతెన వెంకట రామరాజు...
తన పుట్టిన రోజు (జులై 29)ను పురస్కరించుకుని వివిధ సంస్థలకు12 లక్షలు వితరణ చేశారు. తన ఇంటి దగ్గర అత్యంత నిరాడంబరంగా కొవిడ్ నిబంధనలకు లోబడి జరిగిన ఈ కార్యక్రమంలో.. మంతెన వరలక్ష్మి వెంకట రామరాజు, ప్రగతి రిసార్ట్స్ అధినేత జి. బి.కె.రావు, సహ పారిశ్రామికవేత్తలు రంగరాజు, సదాశివరెడ్డి, 'మనం సైతం' కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్నవారిలో.. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ (2 లక్షలు), కరుణశ్రీ సేవా సమితి (1లక్ష), వైదేహి సేవాసమితి (2 లక్షలు), ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ (1 లక్ష), హైద్రాబాద్ చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీ (2 లక్షలు), పల్లవి ఆశ్రమం (1 లక్ష),
హైద్రాబాద్ జిల్లా మహిళా మండలుల సమాఖ్య (1 లక్ష),
అనురాగ్ హ్యూమన్ సర్వీసెస్ (2 లక్షలు), గాంధీ భవన్ న్యాస్
(1లక్ష), మనం సైతం (50 వేలు) తదితర సంస్థలున్నాయి.
మానవ సేవే మాధవ సేవగా తానెప్పుడూ భావిస్తానని, వసుధ ఫౌండేషన్ ద్వారా సహాయం అందుకునే సంస్థలన్నీ చిత్తశుద్ధితో సేవాలందించేవేనని మంతెన వెంకట రామరాజు పేర్కొన్నారు.
అనంతరం ఆయన... 'మనం సైతం' సారధ్యంలో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటి... గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త-తెరాస యువ ఎం.పి. జోగినపల్లి సంతోష్ కుమార్ ను అభినందించారు!!
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







