నేటి నుంచి ప్రారంభం కానున్న2016 షార్జా లైట్ ఫెస్టివల్

- February 05, 2016 , by Maagulf
నేటి నుంచి ప్రారంభం కానున్న2016 షార్జా లైట్ ఫెస్టివల్

  

   అల్ కసిమియ విశ్వ విద్యాలయంలో  2016 షార్జా లైట్ ఫెస్టివల్ ఆరవ దఫా వేడుక శుక్రవారం నుంచి ఎంతో ఘనంగా ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 100 కుటుంబాల వాళ్ళు  ఈ ఉత్సవంను తిలకించేందుకు ఇప్పటకేవిచ్చేశారు. ప్రకాశవంతమైన రంగు రంగుల కాంతులీనే రూపాలు మరియు వివిధ నమూనాలు సందర్శకులను సమ్మోహనపరచనున్నాయి. ఈ అధ్బుత దృశ్యాలను తమ కెమెరాలలో బంధించేందుకు పలువురు ఫోటోగ్రాఫేర్లుఆత్రుత పడటం గమనించవచ్చు.  రానున్న 10 రోజులలో ప్రతి రొజూ సాయంత్రం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకజరుగుతుందని, వారంతంలో ( శని , ఆది వారాల్లో )  సాయంత్రం 6:30 నుండి రాత్రి 12 గంటల వరకు  జరగనున్నట్లునిర్వాహకులు తెలియచేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 30 శాతం మంది వీక్షకులు షార్జా లైట్ ఫెస్టివల్ కుహాజరుకాబోతున్నట్లు వారు అంచనా వేస్తున్నారు.

   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com