హ్యాపీ బర్త్ డే సోనూ సూద్
- July 30, 2020
ముంబై:కరోనా విలయతాండవం చేస్తున్న ఈ ఆపత్కాల సమయంలో మానవత్వం చాటుకుంటూ అందరికీ అండగా నేనున్నా అనే భరోసా కల్పిస్తున్నారు నటుడు సోనూ సూద్. ఆయనను సినిమాల్లో విలన్ గానే చూశాం కానీ రియల్ లైఫ్‌లో మాత్రం అసలు సిసలైన హీరో అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న ఈ రియల్ హీరో పుట్టిన రోజు ఈ రోజు (జులై 30). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
1973 సంవత్సరం జులై 30వ తేదీన జన్మించిన సోనూసూద్ నేటితో 46 సంవత్సరాలు పూర్తిచేసుకొని 47వ యేట అడుగు పెడుతున్నారు. ఆపత్కాలంలో ఆదుకుంటున్న ఆపద్బాంధవుడిగా కీర్తించబడుతున్న ఆయన.. తన పుట్టిన రోజు సందర్భంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.కోవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటూ దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభిస్తున్నారు.ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు.
తాజాగా, చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు. ఆమెకు ఆఫర్ లెటర్ కూడా పంపించారు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూ.. ఇలాంటి మంచి పనులతో రియల్ లైఫ్‌లో హీరోగా మారారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సినిమా తారలు తమ పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటుంటే.. సోనూ సూద్ మాత్రం ఉచిత వైద్య శిబిరాల ద్వారా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతైనా సోనూ భయ్యా గ్రేట్.ఇలాంటి ఎన్నో మంచి పనులతో రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకుంటున్న సోను సూద్‌కి 'మా గల్ఫ్' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?