కువైట్‌: కమర్షియల్‌ విమానాల ఆపరేషన్స్‌ ప్రారంభం

కువైట్‌: కమర్షియల్‌ విమానాల ఆపరేషన్స్‌ ప్రారంభం

కువైట్‌ సిటీ: కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కమర్షియల్‌ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. టి4 టెర్మినల్‌ ద్వారా ప్రయాణీకులకు సేవలు అందించారు. లండన్‌ విమానాశ్రయానికి తొలి విమానం నడిచింది. పర్యాటకం నిమిత్తం తాము వెళుతున్నట్లు కొందరు ప్రయాణీకులు చెప్పారు. మరికొందరు మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ నిమిత్తం వెళుతున్నట్లు వివరించారు. ఇంకొందరు, కరోనా నేపథ్యంలో వర్క్‌ ఆగిపోయిందనీ, ఆ నిమిత్తం వెళుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు పీసీఆర్‌ టెస్ట్‌ అలాగే ఇన్స్యూరెన్స్‌ పాలసీని కువైట్‌ పౌరులకు తప్పనిసరి చేయడం జరిగింది. కతార్‌ అలాగే టర్కీ నుంచి రెండు విమానాలు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాయి.

Back to Top