అల్యూమినియం ఉత్పత్తుల దొంగతనం: ఐదుగురి అరెస్ట్‌

అల్యూమినియం ఉత్పత్తుల దొంగతనం: ఐదుగురి అరెస్ట్‌

మనామా:సదరన్‌ పోలీస్‌, ఐదుగురు వ్యక్తిల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. 4,000 బహ్రెయినీ దినార్ల విలువైన అల్యూమినియం ఉత్పత్తుల్ని నిందితులు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. విచారణ సందర్భంగా ఐదుగురు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ సందర్బంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా, మిగిలిన వ్యక్తులు వాటిని అక్రమంగా విక్రించేందుకు పనిచేశారు.

Back to Top