కువైట్ ఎయిర్ పోర్ట్ ప్రారంభమైన రోజే 10,000 టికెట్లు రద్దు..

- August 02, 2020 , by Maagulf
కువైట్ ఎయిర్ పోర్ట్ ప్రారంభమైన రోజే 10,000 టికెట్లు రద్దు..

కువైట్ సిటీ:సుదీర్ఘ విరామం తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలను ప్రారంభమయ్యాయి. అయితే..చివరి క్షణంలో కువైట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలతో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమైన తొలి రోజే 10 వేల టికెట్లు రద్దు అయ్యాయి. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలతో పాటు మొత్తం 31 దేశాల నుంచి విమానాల రాకపై కువైట్ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవటంతో చివరి క్షణాల్లో ప్రయాణికులు తిప్పలు తప్పలేదు. ఒక్కసారిగా పది వేల టికెట్లు రద్దు కావటంతో పలు విమానయాన సంస్థలు, ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. కువైట్ పౌరవిమానయాన సంస్థ ఆగస్ట్ 1 నుంచి వాణిజ్య సేవలను ప్రారంభించటంతో పలు దేశాల నుంచి ప్రవాసీయులు కువైట్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇండియా, ఈజిప్ట్ దేశాల నుంచి కూడా భారీగా టికెట్లు బుక్ అయ్యాయి. అయితే...భారత్, ఈజిప్ట్ తో సహా 7 దేశాల నుంచి విమానాల రాకను నిరాకరిస్తూ చివరి క్షణాల్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కొందరు ప్రయాణికులు టేకాఫ్ కి ముందు తమ టికెట్లు రద్దు అయినట్లు సమాచారం అందుకొని నిర్ఘాంతపోయారు. ఇక లెబనన్ నుంచి బయల్దేరిన ఓ విమానంలోని 200 మంది ప్రయాణికులు మాత్రం ఉత్తర్వులు వెలువడకముందే కువైట్ లో ల్యాండ్ అయ్యారు. కానీ, ఆ తర్వాతి ఫ్లైట్స్ అన్నింటిని రద్దు చేశారు. ఈజిప్ట్ నుంచి బయల్దేరిన ఏడు విమానాలు కువైట్ కు వెళ్లి..అక్కడి అధికారుల నుంచి అనుమతి రాకపోవటంతో తిరిగి వచ్చాయి. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com