కేరళ గోల్డ్ స్మగ్గ్లింగ్ కేసు:కేంద్ర సహాయమంత్రి నిరాహార దీక్ష
- August 02, 2020
న్యూ ఢిల్లీ:కేరళ సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి వీ మురళీధరన్ ఢిల్లీలో ఒక రోజు నిరాహాద దీక్ష చేపట్టారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేశ్‌తో సీఎం విజయన్, ఆయన మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌కు సంబంధం ఉన్నదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం పదవికి విజయన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. కాగా.. శనివారం నుంచి 18 రోజుల పాటు నిరాహార దీక్షలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. శనివారం నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించడంతో.. బీజేపీ ఎమ్మెల్యే భూపేందర్ యాదవ్ శనివారం నిరాహార దీక్షతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి మద్దతుగా కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ ఆదివారం ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ నేతలు పెద్ధ ఎత్తున నిరాహార దీక్షలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..